ఏపీలో తొలి కరోనా మరణం

First corona death in Andhra Pradesh
  • విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మరణం
  • ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా సోకిన వైరస్
  • కాంటాక్ట్ లోకి వచ్చిన  29 మంది క్వారంటైన్ కు తరలింపు
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆయనకు కరోనా సోకింది. ఆయనను క్వారంటైన్ కు పంపించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మరోవైపు తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ లోకి వచ్చిన 29 మందిని క్వారంటైన్ కు తరలించామని అధికారులు తెలిపారు. ఏపీలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించడంతో... విజయవాడ వాసులు హడలి పోతున్నారు. ఎంతమందికి వైరస్ సోకిందో అని ఆందోళన చెందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
First Death
Woman
Vijayawada

More Telugu News