'నిద్ర'తో ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయిపోయిన కుర్రాడు!
- నిద్రపోతూ టిక్‌టాక్ లైవ్ ఆన్
- గురక పెడుతున్నానా? అన్న విషయం తెలుసుకోవాలనుకున్న యువకుడు
- అనుకోకుండా లక్షలాది మంది చూసిన వైనం
అయితే, అతడు నిద్రపోతోన్న వీడియోను లక్షలాది మంది చూశారు. ఐదు గంటలు నిద్రపోయిన అనంతరం నిద్రలేచి చూసుకుని షాక్ అయ్యాడు. ఎన్నడూ లేనంతగా తన వీడియోను ఇన్ని లక్షల మంది చూడడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. దీంతో పలుసార్లు నిద్రపోతూ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేశాడు. వాటిని కూడా లక్షలాది మంది చూశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయిపోయాడు. అతడి ఫాలోవర్ల సంఖ్య అమాంతం 10 లక్షలకు చేరింది. టిక్‌టాక్‌లో పాప్యులర్ స్టార్ అయిపోయాడు.