Corona Virus: మర్కజ్‌కు నేను వెళ్లలేదు.. ఆ ఛానల్‌పై పరువు నష్టం దావా వేస్తా: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా

amzad on fake news on him
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన ప్రార్థనల వల్ల చాలా మందికి కరోనా వైరస్‌ వ్యాధి సోకడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్‌  ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కూడా వెళ్లారని వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంపై మాత్రమే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పారు. అనంతరం తాను మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని వివరించారు.
 
తాను మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. తాను ఆ సభలకు వెళ్లలేదని నిరూపించుకుంటే ఆ ఛానల్‌ను మూసేస్తారా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Corona Virus
India
Andhra Pradesh

More Telugu News