మహేశ్ బాబు సరసన కైరా అద్వాని .. సారా అలీఖాన్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు సరసన కైరా అద్వాని .. సారా అలీఖాన్?

Vamshi Paidipalli Movie
  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు
  • భారీ బడ్జెట్ తోనే రంగంలోకి  
  •  కథానాయికల ఎంపికపై కసరత్తు 
ప్రస్తుతం మహేశ్ బాబు .. తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి.

దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్న కథానాయికల జాబితాలో కైరా అద్వాని .. సారా అలీఖాన్ పేర్లు ముందువరుసలో వున్నాయి. మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్ ను తీసుకోవచ్చని కొంతమంది అంటున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Mahesh Babu
Kiara adwani
Sara Alikhan

More Telugu News