సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.65 తగ్గుదల
- గత నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 805
- ప్రపంచ వ్యాప్తంగా 55 శాతం తగ్గిన క్రూడ్ ధరలు
- తగ్గిన ధరలతో రూ.744కే ఎల్‌పీజీ సిలిండర్
గత నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 805.5గా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.744కి లభించనుంది.