Corona Virus: డయల్ 100కు 3 రోజుల్లో 6.4 లక్షల కాల్స్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
- కొందరు సామాజిక దూరం పాటించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు
- కరోనా అనుమానితుల సమాచారం ఇస్తున్నారు
- ఇంటికి పరిమితమవ్వాలి
- హైదరాబాద్‌లో ఎక్కడా వాహనాల రద్దీ లేదు
డయల్ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మూడు రోజుల వ్యవధిలో 100 నంబరుకు 6.4 లక్షల కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొంతమంది తమకు కరోనా అనుమానితుల సమాచారం ఇస్తున్నారని చెప్పారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంటికి పరిమితమవ్వడమే మనముందున్న ప్రత్యామ్నాయ మార్గమని ఆయన తెలిపారు. ప్రజలంతా నిబంధనలు పాటించాలని ఆయన చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఎక్కడా కూడా వాహనాల రద్దీ లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అనుమతి ఉన్న వాహనాలు తిరిగేలా ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారని చెప్పారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి మాత్రమే జరిమానా విధిస్తున్నామని తెలిపారు.