Prabhudeva: ప్రభుదేవా సైకోగా 'భగీర'

Bhageera Movie
  • దర్శకుడిగా ప్రభుదేవా బిజీ 
  •  హీరోగా మూడు సినిమాలు 
  • ఆసక్తిని పెంచుతున్న 'భగీర' 
ఒక వైపున దర్శకుడిగా సినిమాలు తీస్తూనే, మరో వైపున హీరోగాను ప్రభుదేవా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పక్కాగా ప్లాన్ చేసుకుని, కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. హీరోగా ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. వాటిలో వైవిధ్యభరితమైనదిగా 'భగీర' కనిపిస్తోంది.

సైకో థ్రిల్లర్ కథ ఇది .. ప్రభుదేవా సైకోగా కనిపించనున్నాడు. ఇంతవరకూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే అమైరా దస్తూర్ .. గాయత్రిలను ఎంపిక చేశారు. మరో ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.
Prabhudeva
Amyra Dustur
Gayatri
Bhageera Movie

More Telugu News