Brahmaji: హీరోయిన్లపై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం

Actor Brahmaji fires on Tollywood Heroines
  • సినీ కార్మికుల సహాయార్థం సీసీసీ ఛారిటీ ఏర్పాటు
  • ముంబై భామల నుంచి కరవైన మద్దతు
  • హీరోయిన్లు స్పందించడం లేదని బ్రహ్మాజీ ఫైర్
హీరోయిన్లపై టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు 'సీసీసీ' ఛారిటీకి హీరోయిన్ల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడమే బ్రహ్మాజీ కోపానికి కారణం.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని... అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. కేవలం లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారని చెప్పారు.
Brahmaji
CCC
Heroines
Tollywood

More Telugu News