Andhra Pradesh: కర్నూలులో గుర్రంపై తిరుగుతూ.. వినూత్న ప్రచారం చేస్తున్న ఎస్సై!

Andhra Pradesh Sub Inspector Maruti Sankar painted with images corona
  • కరోనాపై అవగాహన కల్పిస్తూ తిరుగుతున్న ఎస్సై మారుతి శంకర్ 
  • కరోనా వైరస్‌ గుర్తులు పెయింటింగ్ వేసిన గుర్రంపై ప్రచారం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఎస్సై మారుతి శంకర్.. కరోనా వైరస్‌ గుర్తులు వున్న గుర్రంపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తెల్లటి గుర్రంపై ఎరుపు రంగులో కరోనా వైరస్‌ గుర్తులు వేశారు.
             
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఆయన కోరారు. కూరగాయల మార్కెట్లు, రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకుని, బాధ్యతగా మెలగాలని ఆయన చెబుతున్నారు.
Andhra Pradesh
Kurnool District
Police
Corona Virus

More Telugu News