గోవా ప్రయాణికుడికి కరోనా పాజిటివ్..సెల్ఫ్ క్వారంటైన్లోకి ‘విస్తారా’ సిబ్బంది
- 22న ముంబై నుంచి గోవా వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్
- గతంలో అతను న్యూయార్క్ వెళ్లొచ్చినట్టు గుర్తింపు
- తోటి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేసిన గోవా ప్రభుత్వం
విస్తారాకు చెందిన యూకే 861 నంబరు విమానంలో అతను ముంబై నుంచి తమ రాష్ట్రానికి వచ్చినట్టు తేలడంతో ప్రభుత్వం సదరు విమానయాన సంస్థను అప్రమత్తం చేసింది. వెంటనే స్పందించిన విస్తారా.. ఆ విమానం నడిపిన పైలట్, కో పైలట్లు, ఇతర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు కూడా వెంటనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని గోవా ప్రభుత్వం సూచించింది. ప్రయాణికులంతా వెంటనే హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేయాలని, లేదంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది.