సీసీసీ ఫండ్ కు హీరో ప్రభాస్ రూ.50 లక్షల విరాళం
- రోజు వారీ సినీ కార్మికుల కోసం సీసీసీ ఫండ్ ఏర్పాటు
- ఇప్పటికే పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్ కు రూ. 4 కోట్లు ప్రకటించిన ప్రభాస్
- రూ.75 వేలు విరాళంగా ఇస్తానన్న బ్రహ్మాజీ
ప్రముఖ హీరో ప్రభాస్ తన విరాళంగా రూ.50 లక్షలు ప్రకటించాడు. ‘కరోనా’పై పోరాటానికి గాను పీఎం రిలీఫ్ ఫండ్ కు, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించాడు. టాలీవుడ్ కు చెందిన మరో నటుడు బ్రహ్మాజీ కూడా సీసీసీకి రూ.75 వేలు విరాళంగా ప్రకటించాడు.