Defence: కరోనాపై పోరుకు రక్షణశాఖ ఉద్యోగుల భారీ విరాళం

Ministry of Defence Employees contribute one day salary for PM Cares Fund
  • ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం
  • రూ.500 కోట్లు ఇస్తున్నట్టు తెలిపిన రక్షణ శాఖ ఉద్యోగులు
  • పారా మిలిటరీ బలగాలు రూ.116 కోట్ల విరాళం ప్రకటన
చైనాలో మొదలై భారత్ ను కూడా కబళించేందుకు వచ్చిన కరోనా మహమ్మారిపై లాక్ డౌన్ రూపంలో పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగులు (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ) భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. తమ ఒక రోజు జీతం (రూ.500 కోట్లు) పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు. అటు, కేంద్ర పారా మిలిటరీ బలగాలు కూడా తమ ఒక రోజు జీతం (రూ.116 కోట్లు) పీఎం కేర్స్ ఫండ్ కు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెక్ లు అందించారు.
Defence
Ministry
Para Military
Corona Virus
India
Donation
PM Cares Fund

More Telugu News