శ్రీరామ నవమి రోజున 'ఆచార్య' ఫస్టులుక్
- కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
- డిఫరెంట్ లుక్ తో చిరంజీవి
- కథానాయికగా కాజల్
ఈ సినిమా నుంచి 'శ్రీరామనవమి'కి ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచనలో కొరటాల ఉన్నాడనేది తాజా సమాచారం. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీకి ఫస్టులుక్ ను రిలీజ్ చేసే పనిలోనే కొరటాల వున్నాడని అంటున్నారు. చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపించిన దగ్గర నుంచి, ఆయన ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.