Sri Vishnu: 'రాజ రాజ చోర'పై శ్రీవిష్ణు నమ్మకం

Raja Raja Chora Movie
షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇంతకుముందు ఆయన చేసిన 'తిప్పరా మీసం' పరాజయం పాలైంది. దాంతో యాక్షన్ సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా వుండాలని నిర్ణయించుకున్న ఆయన, ఈ సారి కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.

అలా 'రాజ రాజ చోర' సినిమా నిర్మితమవుతోంది. పీపుల్ మీడియా - అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై శ్రీ విష్ణు గట్టి నమ్మకంతో వున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో శ్రీవిష్ణు వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. సునైన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.
Go Back to Shorts
Sri Vishnu
Sunaina
Hasith Goli

More Telugu News