ప్రతి రోజు కొద్దిసేపైనా మద్యం షాపులు తెరవండి: సీనియర్ నటుడు రిషి కపూర్
- ఇంటికే పరిమితమైన వారు అనిశ్చితి, నిరాశలో ఉంటారు
- వారికి మద్యం అవసరం చాలా వుంటుంది
- తప్పుగా అర్థం చేసుకోవద్దు
రిషికపూర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. నటుడి అభిప్రాయంతో ఏకీభవిస్తూ కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్న వారికి నీళ్లు ఎంత అవసరమో, మద్యం బాబులకు మందు కూడా అంతే అవసరమంటూ భావాత్మక పోస్టులతో నింపేస్తున్నారు. అయితే, ఇలాంటి సమయంలో షాపులు తెరవడం సాహసమే అవుతుందని మరికొందరు పేర్కొన్నారు. మద్యం షాపులు తెరిస్తే రద్దీని తట్టుకోవడం కష్టమని మరికొందరు అభిప్రాయపడ్డారు.