UK: బ్రిటన్ ఆరోగ్యమంత్రినీ వదలని కరోనా మహమ్మారి

UK health minister Matt Hancock tested corona positive
  • బ్రిటన్ ఆరోగ్యమంత్రి హేంకాక్ కు కరోనా పాజిటివ్
  • స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న హేంకాక్
  • ఇప్పటికే కరోనా బారినపడిన బ్రిటన్ యువరాజు, ప్రధాని
కరోనా వైరస్ భూతం బ్రిటన్ లో ప్రముఖులను సైతం వదలడంలేదు. ఇప్పటికే యువరాజు చార్లెస్, ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారినపడ్డారు. తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ కూడా చేరారు. వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని హేంకాక్ ట్విట్టర్ లో వెల్లడించారు. అదృష్టవశాత్తు తీవ్ర లక్షణాలేవీ లేవని, దాంతో స్వీయనిర్బంధంలో ఉంటూ ఇంటి నుంచే పనిచేస్తున్నానని తెలిపారు. ఇంట్లోనే ఉండడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
UK
Health Minister
Matt Hancock
Corona Virus
Positive
COVID-19

More Telugu News