Ganta Srinivasa Rao: విశాఖలో ‘కరోనా’ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటూ సీఎం జగన్ కు గంటా లేఖ

TDP Leader Ganta Srinivas Rao writes a letter to CM Jagan
  • హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి
  • విశాఖలో మరిన్ని చోట్ల రైతు బజార్లు కావాలి
  • ఏప్రిల్ 20 వరకు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి
కరోనా వైరస్ వ్యాస్తి నిరోధక చర్యల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా పలు విజ్ఞప్తులు చేశారు. విశాఖపట్టణంలో ‘కరోనా’ టెస్ట్ ల్యాబ్, హై రిస్క్ ఉన్న ప్రాంతాలైన సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం విశాఖలో మరిన్ని చోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. జీవీఎంసీ ప్రాపర్టీ టాక్స్ ను మూడేళ్ల పాటు, ఏప్రిల్ 20 వరకు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని ఆ లేఖలో కోరారు.
Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News