Ayyanna Patrudu: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. సీఎం జగన్ కు ఓ సూచన చేసిన అయ్యన్నపాత్రుడు

TDP Leader Ayyannapatrudu suggestion to CM Jagan
  • పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్యాకేజ్ ‘గరీబ్ కల్యాణ్’ 
  • ప్రధాని మోదీ ఈ ప్యాకేజ్ ను ప్రకటించడం అభినందనీయం
  • ఇదే తరహాలో ఓ ప్యాకేజ్ ను ఏపీలో కూడా ప్రకటించాలి 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ కారణంగా  నిరుపేదలు, కార్మికులు, పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచే నిమిత్తం ప్రధాని మోదీ గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ను ప్రకటించారు. దీనిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేస్తూ మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్యాకేజ్ కింద రూ. 1.70 లక్షల కోట్లను ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు ఆయన ఓ సూచన చేశారు. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ప్యాకేజ్ ప్రకటించాలని కోరారు.
Ayyanna Patrudu
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News