ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో!: జబర్దస్త్ రష్మీ ఆగ్రహం
- పేదలకు ఫుడ్ దొరకట్లేదు
- కొందరికి చెత్త ఏరుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు
- మీరు తినేటప్పుడు ఒక్క చపాతి అయినా వారికి ఇవ్వండి
- అన్నీ మనమే తినేయాలనుకోవడం స్వార్థం
'చపాతి, రైస్.. కనీసం బిస్కెట్లయినా సరే వారికి ఇస్తే వారు తింటారు. కనీసం మీ గేటు వద్దయినా కాస్త ఆహారం పెట్టండి. వారు వచ్చి తీసుకుని తింటారు' అని తెలిపింది. అయినప్పటికీ నెటిజన్లు పలు రకాలుగా దీనిపై వ్యాఖ్యలు చేయడంతో స్వార్థపూరితంగా ఉండకూడదని చెప్పింది. 'అన్నీ మనమే తినేయాలి. అన్నీ మనమే కొనుక్కుని పెట్టుకోవాలి అనుకుంటే కష్టం' అని ఆమె తెలిపింది. 'ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో' అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.