Kesineni Nani: ఈ నెంబర్లకు ఫోన్ చేసి.. ఉచిత వైద్య సదుపాయం పొందండి: కేశినేని నాని

Call these numbers to get free medical facilities says Kesineni Nani
  • రతన్ టాటాగారితో కలిసి 21 టెలి మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశాం
  • ఈ సెంటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయి
  • ఎవరికి ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
టాటా ట్రస్టు సహకారంతో తాను ఏర్పాటు చేసిన టెలి మెడిసిన్ సెంటర్లు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్లినిక్ కు రాలేని ప్రజలు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి ఉచితంగా వైద్య సంప్రదింపులు జరపవచ్చని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

'విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం రతన్ టాటాగారితో కలిసి నేను ఏర్పాటు చేసినటువంటి 21 టెలి మెడిసిన్ సెంటర్లు ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాయి. కావున ఎవరికి ఏ ఇబ్బంది వున్నా మీకు దగ్గరలో ఉన్న సెంటర్ కి ఫోన్ చేసిన యెడల మీకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది' అని కేశినేని నాని తెలిపారు. దీంతో పాటు టెలి మెడిసిన్ సెంటర్లు, వాటి ఫోన్ నెంబర్లను షేర్ చేశారు. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.  
Kesineni Nani
Telugudesam
Ratan Tata
Tara Trust
Tele Medicine Centers
Vijayawada

More Telugu News