Hand wash: చేతులు శుభ్రం చేసుకోని దేశాల్లో చైనా టాప్!: షాకింగ్ సర్వే

India is in top ten in worst hand washing culture
  • భారత్‌లో సగం మంది చేతులు కడుక్కోరు
  • జాబితాలో భారత్‌కు పదో స్థానం
  • సౌదీని చూసి నేర్చుకోవాలంటున్న సర్వే నివేదిక
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం.. కరోనా వైరస్‌కు ఇప్పుడున్న ఔషధాలు ఈ రెండే. వీటిని తు.చ. తప్పకుండా పాటించడం వల్ల ఈ ప్రాణాంతక వైరస్ బారి నుంచి కొంతవరకు రక్షించుకోవచ్చు. అయితే, ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.

మన దేశంలో సగం మందికి చేతులు శుభ్రం చేసుకునే అలవాటే లేదన్నది ఆ సర్వే సారాంశం. ‘వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌’ పేరుతో 63 దేశాల్లో ఈ సర్వే నిర్వహించిన సంస్థ తాజాగా ఆ వివరాలను వెల్లడించింది. చేతులు శుభ్రం చేసుకోని దేశాల జాబితాలో భారత్‌కు పదో స్థానాన్ని కట్టబెట్టింది. మన దేశ జనాభాలో దాదాపు సగం మందికి చేతులు శుభ్రం చేసుకునే అలవాటే లేదని తేల్చింది.

ఇక, ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. డ్రాగన్ కంట్రీలో చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ముప్పావు వంతు ప్రజల్లో లేనే లేదట. దేశ జనాభాలో 23 శాతం మంది చేతులను శుభ్రం చేసుకుంటారని సర్వేలో వెల్లడైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది ఇక్కడే కావడం గమనార్హం. చైనా తర్వాతి స్థానంలో అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, దక్షిణకొరియా ఉండడం మరో విశేషం. సౌదీ అరేబియా వాసులు మాత్రం చేతులు శుభ్రం చేసుకోవడంలో ముందున్నారని, మిగతా ప్రపంచానికి వారే ఆదర్శమని సర్వే స్పష్టం చేసింది.
Hand wash
Corona Virus
Survey
India
China

More Telugu News