కరోనాపై... రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన నరేంద్ర మోదీ!
- కరోనాపై అభిప్రాయాలు పంచుకున్న ఇరు నేతలు
- భారత్ చర్యలు సంతృప్తికరమన్న పుతిన్
- కరోనా నుంచి బయటపడుతుందన్న ఆశాభావం
ఇదే సమయంలో ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇండియాలో నామమాత్రపు ప్రభావంతోనే వైరస్ కట్టడి అవుతుందన్న ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. కరోనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సేవలు, ఔషధాలు, టీకా కోసం సైంటిఫిక్ రీసెర్చ్ తదితరాలను మానవతా దృక్పథంతో ఇతర దేశాలకు అందించాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు.