అనుష్క కూడా 'ఆచార్య'ను అందుకే ఒప్పుకోలేదా?

Acharya Movie
  • 'ఆచార్య'కి నో చెప్పిన త్రిష
  • సున్నితంగా తిరస్కరించిన అనుష్క 
  • కథానాయికగా ఎంపికైన కాజల్
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష'ను అనుకున్నారు. అయితే తన పాత్ర నిడివి .. ప్రాధాన్యత తక్కువగా వున్న కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆ తరువాత అనుష్కను సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకున్నారు. ఆమె సున్నితంగా తిరస్కరించిందనే ప్రచారం జరిగింది. అయితే అనుష్క కూడా తన పాత్రకి ప్రాధాన్యత లేని కారణంగానే 'నో' చెప్పిందనేది తాజా సమాచారం. పాత్ర నిడివి తక్కువగా ఉండటమే కాకుండా, కొన్ని సన్నివేశాల్లో తన పాత్రకి డైలాగ్స్ కూడా లేని కారణంగానే ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. త్రిష .. అనుష్క తిరస్కరించిన పాత్రను ఇప్పుడు కాజల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chiranjeevi
Kajal Agarwal
Koratala Siva

More Telugu News