యావత్ ప్రపంచం కరోనాతో వణికిపోతున్న వేళ శార్వరీనామ ఉగాది వస్తోంది: పవన్ కల్యాణ్
- తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
- కొత్త సంవత్సరం అందరికీ శుభం కలుగజేయాలని ఆకాంక్ష
- కరోనా ముప్పు తొలగిన నాడే నిజమైన ఉగాది అంటూ వ్యాఖ్యలు
ఈసారి ఉగాది వేడుకలను ఇంటి వరకే పరిమితం చేసుకుందామని, ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకుందాం అని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా ముప్పు తొలగిననాడే నిజమైన ఉగాది అని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరం ప్రభుత్వ సూచనలు పాటించి, సమష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు.