Sensex: ఎట్టకేలకు నష్టాల నుంచి కోలుకుని.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex and Nifty rebound after a huge loss
  • 693 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 191 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 12 శాతానికి పైగా లాభపడ్డ ఇన్ఫోసిస్
కరోనా వైరస్ నేపథ్యంలో భారీగా పతనమవుతూ వస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... ఆ తర్వాత లాభాల బాట పడ్డాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను ప్రకటిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 693 పాయింట్లు పెరిగి  26,674కి చేరుకుంది. నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 7,801కి ఎగబాకింది. ఐటీ, టెక్, ఎనర్జీ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (12.69%), బజాజ్ ఫైనాన్స్ (9.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (8.34%), మారుతి సుజుకి (7.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (6.86%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-8.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.19%), ఐటీసీ (-3.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.85%), ఎల్ అండ్ టీ (-2.13%).
Sensex
Nifty
Stock Market

More Telugu News