Melania Trump: మెలానియాకు కరోనా పరీక్షలు... నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న వైట్ హౌస్

US first lady Melania Trump tested corona negetive
  • ఈ నెల 13న ట్రంప్, మెలానియాలకు కరోనా పరీక్షలు
  • మెలానియా పరీక్షల ఫలితాన్ని ఇవాళ వెల్లడించిన వైట్ హౌస్
  • మెలానియా సంపూర్ణ ఆరోగ్యంతో ఉందన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు వైరస్ సోకలేదని తేలడంతో వైట్ హౌస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 13న డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ కు నెగెటివ్ వచ్చిన విషయాన్ని అప్పుడే వెల్లడించారు. మెలానియా ఫలితాన్ని ఇవాళ తెలిపారు. మెలానియా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ అమెరికాను కూడా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 400కి పైగా మరణాలు సంభవించాయి. బాధితుల సంఖ్య 33 వేలు దాటింది.
Melania Trump
USA
Corona Virus
Negetive
White House

More Telugu News