మనవరాలి పెళ్లిని వాయిదా వేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే!
- వచ్చే నెల 4న జరగాల్సిన వివాహం
- కేసీఆర్ సహా వేలాది మందికి ఆహ్వానం
- ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తన మనవరాలి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వేలాదిమందిని ఆహ్వానించామని అయితే, పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోవడంతో వివాహాన్ని వాయిదావేసుకోక తప్పలేదన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 33 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది.