కరోనా మృత్యు ఘోష.. ప్రపంచవ్యాప్తంగా 15 వేలు దాటిన మరణాలు!
- 15,189కి కరోనా మరణాల సంఖ్య
- యూరప్‌లో అత్యధికంగా 9,197 మంది మృతి
- 24 గంటల్లో 1,395 మంది బలి
గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 462 మంది స్పెయిన్ దేశస్తులు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 2,182కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 33,089కి చేరింది. ఇటలీలో 5,476 మందిని కరోనా మహమ్మారి బలితీసుకోగా, చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు.