పందొమ్మిది రాష్ట్రాలు లాక్ డౌన్: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- అందులో 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి
- ఇప్పటి వరకు 415 కేసులు నమోదయ్యాయి
- ‘కరోనా’ బాధితుల కోసం ఆసుపత్రులను సిద్ధం చేయాలి
దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయని, అందులో 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నట్టు వివరించారు. ‘కరోనా’ బాధితుల కోసం ఆసుపత్రులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 415 కేసులు నమోదయ్యాయని, 23 మంది డిశ్చార్జి అయ్యారని, ఏడుగురు మృతి చెందారని తెలిపారు.
దేశ వ్యాప్తంగా 15000 కేంద్రాల్లో నమూనాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కరోనా పరీక్షా కేంద్రాలకు మార్గదర్శకాలు రూపొందించామని, ప్రైవేట్ సంస్థలకు కరోనా పరీక్షలకు అనుమతిస్తే పరీక్షల రుసుం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ఉండాలని సూచించారు.