నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే కఠిన చర్యలు.. జైలుకు పంపుతాం: ఏపీ మంత్రి కొడాలి నాని

ప్రజల్లో నెలకొన్న కరోనా భయం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పడుతోన్న అపోహలతో వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు సీరియన్‌ అయింది. వ్యాపారులు పెంచుతున్న ధరలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని స్పందించారు. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే జైలుకు పంపుతామని నాని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరించాలని ఇది వారికే కాకుండా దేశానికి కూడా మంచిదని చెప్పారు. సీఎం జగన్ చేసిన సూచనల మేరకు ఈ నెల 29వ తేదీన రేషన్ సరుకులు అందజేస్తామని తెలిపారు. తెల్ల కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరుకులు, కిలో కందిపప్పు కూడా ఇస్తామన్నారు.


More Telugu News