ఇంట్లో ఉండలేమని భావించే వారు ఇలా చేయొచ్చు: పూరి జగన్నాథ్ సలహా

  • ప్రధాని మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం
  • నాలుగు స్పూన్ల ఆముదం తాగితే విరేచనాలు పట్టుకుంటాయి
  • అప్పుడిక ఇంట్లోంచి బయటకు వెళ్లలేరు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. అయితే, అన్నేసి గంటలు ఇంట్లో ఉండడం తమ వల్ల కాదని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆముదం తాగాలని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సలహా ఇచ్చాడు.

మోదీ జనతా కర్ఫ్యూకి మద్దతుగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అందరం ప్రధాని మాట విందామని ఆ వీడియోలో పేర్కొన్న పూరి.. అలా చేస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందన్నాడు. కాబట్టి పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామన్నాడు.

తాము ఇంట్లో ఉండలేమంటూ ప్రస్టేషన్‌కు గురయ్యే వారికి తనదో సలహా అని, అలాంటి వారు నేటి ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని వివరించాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ వీక్షించండి.

Puri Jagannadh
Janata Curfew
Tollywood
Telangana

More Telugu News