Anushka Sharma: స్వీయ నిర్బంధంలో కోహ్లీ, అనుష్క స్వీట్ సెల్ఫీ... నెట్‌లో వైరల్‌

Anushka And Virat Kohli Goofy Selfie Is The Best Thing On The Internet Today
  • సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఒకరినొకరం మరింతగా  ప్రేమించుకుంటున్నాం: అనుష్క
  • కోహ్లీతో కలిసి దిగిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • కరోనా కట్టడికి ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించిన దంపతులు
కరోనా దెబ్బకు  క్రికెట్, సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో దొరికిన ఖాళీ సమయాన్ని  టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ  బాగా ఆస్వాదిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ జంట తమ ఇంట్లో  స్వీయ నిర్బంధంలో ఉంది. ఈ సందర్భంగా తీసుకున్న ఓ సరదా సెల్ఫీని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘మమ్మల్ని మేం మరింతగా, అన్ని విధాలుగా ప్రేమించుకునేందుకు ఈ సెల్ఫ్ ఐసోలేషన్‌ (స్వీయ నిర్బంధం) సాయపడుతోంది’ అని రాసుకొచ్చింది. ఇప్పుడీ ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని కోహ్లీ, అనుష్క ఇదివరకే వీడియో సందేశం ఇచ్చారు. తామిద్దరం స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెప్పారు. ప్రజలు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయి, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు.
Anushka Sharma
Virat Kohli
selfie
self isolation

More Telugu News