మమ్మల్ని కాపాడండంటూ వేడుకుంటున్న మనీలాలోని తెలుగు విద్యార్థినులు
- ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం
- ఫిలిప్పీన్స్ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
- భారత్ వచ్చేందుకు విమానాల్లేక అవస్థలు
- మనీలా ఎయిర్ పోర్టు నుంచి గెంటేసిన అధికారులు
ఫిలిప్పీన్స్ లోని తెలుగు విద్యార్థులు మలేసియా మీదుగా భారత్ వద్దామనుకుంటే కౌలాలంపూర్ నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయి. అటు మనీలా నుంచి నేరుగా భారత్ కు విమానసర్వీసులు లేవు. ఈ నేపథ్యంలో, మనీలా ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను అక్కడి అధికార వర్గాలు గెంటేశాయి. ఇక్కడి రెస్టారెంట్లు, హోటళ్లు కూడా మూతపడ్డాయని, తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడంలేదని ఉత్తరాంధ్ర విద్యార్థినులు వాపోయారు.
q