KCR: రేపు కరీంనగర్​ లో పర్యటించనున్న సీఎం కేసీఆర్​

CM KCR going to visit Karimnagar
  • ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొంత మందికి ‘కరోనా’  
  • అధికార యంత్రాంగం అప్రమత్తం
  • ‘కరోనా’ నిరోధానికి చేపట్టిన చర్యలను పర్యవేక్షించనున్న కేసీఆర్ 
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ లో పర్యటించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. కేసీఆర్ వెంట రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు. కాగా, ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన కొంత మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి గురించి కేసీఆర్ తెలుసుకుంటున్నారు.
KCR
TRS
karimnagar
Corona Virus
Telangana

More Telugu News