Vijay Sai Reddy: యనమల గారి డిమాండు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy take a dig at TDP leader Yanamala
  • కేంద్ర బలగాలతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న యనమల
  • గతంలో ఏం మాట్లాడారంటూ విజయసాయి విసుర్లు
  • ప్రజాకంటకులు అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఆపై ఎన్నికలు వాయిదా నిర్ణయంతో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, వాయిదాపడిన స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేస్తుండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలంటూ యనమల గారు డిమాండ్ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. సీబీఐని నిషేధించినవాళ్లు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు అంటూ విమర్శించారు. 'మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం, అనవసర ఖర్చులు తప్ప' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijay Sai Reddy
Yanamala
Local Body Polls
Armed Forces
Andhra Pradesh

More Telugu News