Virat Kohli: మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం: విరాట్ కోహ్లీ

Virat Kohli and Team India responds to PM Modi Janata Curfew call
  • ప్రపంచవ్యాప్త వైద్యసిబ్బందికి కోహ్లీ కృతజ్ఞతలు
  • మోదీ జనతా కర్ఫ్యూ పిలుపునకు స్పందన
  • మోదీ సూచనలు పాటిద్దాం అంటూ విజ్ఞప్తి
స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించి కరోనా మహమ్మారిని దూరంగా ఉంచుదాం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు టీమిండియా క్రికెటర్ల నుంచి విశేషమైన మద్దతు లభించింది. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రధాని మోదీ చేసిన సూచనలను పాటిద్దాం అంటూ సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులను కాపాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించాడు. మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం అంటూ విజ్ఞప్తి చేశాడు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం ఎంతో అవసరం అని కోహ్లీ స్పష్టం చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మోదీ నిర్ణయాన్ని స్వాగతించాడు. ప్రధానితో చేతులు కలిపి జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందామని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్, ధావన్, పంత్, కేఎల్ రాహుల్, రహానే, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ సైతం ప్రధాని మోదీ నిర్ణయానికి మద్దతు పలికారు.
Virat Kohli
Narendra Modi
Janata Curfew
Corona Virus
India
Team India
Cricket

More Telugu News