Narendra Modi: ప్రధాని మోదీ చేసిన సూచనలు పాటిద్దాం: పవన్ కల్యాణ్

pawan about modi speech
  • మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నా
  • వాటిని ప్రజలందరూ పాటించాలి
  • ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలి 
కరోనాపై ప్రధాని మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆయన కోరారు. ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలని అన్నారు. కరోనా మహమ్మారి ప్రమాదకరమని తెలిసినప్పటికీ సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.                                                                        

        
Narendra Modi
Pawan Kalyan
Corona Virus

More Telugu News