Telugudesam: టీడీపీ కార్యాలయంలోకి కార్యకర్తలు, సందర్శకులకు నో ఎంట్రీ

Telugudesam party restrics entry for party workers in to office
  • కరోనా నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం
  • కార్యాలయ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం
  • సమాచారం ఉంటే ఫోన్ ద్వారా అందించాలని శ్రేణులకు సూచన
కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని మోదీ సూచనల మేరకు ఏపీలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోకి పార్టీ కార్యకర్తలు, సందర్శకులకు అనుమతిని నిలిపివేస్తున్నట్టు పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటనలో తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్, ఫోన్ ద్వారా అందించాలని చెప్పింది. ఇంటి వద్ద నుంచే కార్యాలయ సిబ్బంది పని చేయాలని ఆదేశించింది. మరోవైపు, కరోనా గురించి ప్రజల్లో టీడీపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రజా శ్రేయస్సు కోసం టీడీపీ ఎప్పుడూ పాటుపడుతుందని తెలిపింది.

Telugudesam
Corona Virus
Staff
Work from Home

More Telugu News