నిర్మాతగా మారనున్న రష్మిక?
- వరుస విజయాలతో రష్మిక
- బన్నీ జోడీగాను దక్కిన ఛాన్స్
- కెరియర్ తొలినాళ్లలోనే సాహసం
ఈ నేపథ్యంలోనే రష్మిక నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. కథానాయికలు నిర్మాతలుగా మారడమనేది చాలా కాలం నుంచి వస్తున్నదే. అయితే అందులో సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువ. ఇక కొంత కెరియర్ ను చూసిన వాళ్లు నిర్మాతలుగా మారారే గానీ, ఆరంభంలోనే ఆ సాహసం చేయలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే కెరియర్ ఊపందుకుంటున్న సమయంలో రష్మిక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల, అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.