ఒంగోలులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నెల్లూరు డిపో బస్సులో ప్రయాణం!

Corona positive man travels Nellore depot bus
  • బస్సులో 16 మంది ప్రయాణించినట్టుగా గుర్తింపు
  • వారిలో 8 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారన్న జిల్లా కలెక్టర్
  • నెల్లూరు ఐసోలేషన్ వార్డులో ఐదుగురు అనుమానితులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒంగోలులో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి నెల్లూరు డిపో బస్సులో ప్రయాణించినట్టు అధికార వర్గాలకు సమాచారం అందింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కిన బస్సులో 16 మంది ప్రయాణించినట్టు గుర్తించారు. వారిలో 8 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని, ఏడుగురు జిల్లా వాసులని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు వెల్లడించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఐదుగురు కరోనా అనుమానితులు ఉన్నారని, నెల్లూరు జిల్లాలో మొత్తం 793 స్వీయనిర్బంధంలో ఉన్నారని వివరించారు.
Go Back to Shorts
Ongole
Nellore
RTC Bus
Corona Virus
Positive

More Telugu News