రవితేజతో మరోసారి జోడీ కడుతున్న మాళవిక శర్మ
- రవితేజతో 'బలుపు' చేసిన శ్రుతి హాసన్
- 'బెంగాల్ టైగర్' తరువాత తమన్నాకి ఛాన్స్
- మళ్లీ అవకాశం దక్కించుకున్న 'నేల టిక్కెట్టు' భామ
ఆ తరువాత సినిమాను ఆయన నక్కిన త్రినాథరావు దర్శత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో తమన్నా .. రవితేజ జోడీ కడుతోంది. గతంలో ఆమె 'బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజతో కలిసి నటించింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేశారట. ఇంతకుముందు ఆమె 'నేల టిక్కెట్టు'లో రవితేజతో కలిసి అలరించింది. ఇలా రవితేజ వరుసగా హీరోయిన్స్ ను రిపీట్ చేస్తుండటం విశేషం. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమాలో, కథానాయికగా ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.