సుప్రీంకోర్టు చెప్పిన విషయమైనా జగన్​ కు అర్థమవుతుందా?: యనమల

Yanamala Ramakrishnudu questioned Jagan
  • సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ పరిధిలోనిదేనని స్పష్టం చేసింది
  • జగన్ తన మొండి వైఖరిని విడనాడాలి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదేనని స్పష్టం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విషయమైనా జగన్ కు అర్థమవుతుందా? అని ప్రశ్నించారు.  ‘సుప్రీం’ తీర్పు వైసీపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఈ తీర్పుతో అయినా జగన్ తన మొండి వైఖరిని విడనాడాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Yanamala
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Local Body Polls

More Telugu News