అందుకే చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగాడు: విజయసాయిరెడ్డి

  • రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి పోయాడు
  • ఓటమి భయంతో ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టాడు
  • ఇప్పుడు మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నాడు
  • ఆయనకు ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లట్లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడడం చంద్రబాబు నాయుడి కుట్రేనని చెప్పారు.

'రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి పోయాడు. ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టాడు. ఇప్పుడు మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నాడు. ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లక చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగాడు' అని విమర్శించారు.    

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News