రంగారెడ్డి జిల్లాలో కలకలం.. ఒంటిపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం లభ్యం
- చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఘటన
- ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
- హత్యాచారం చేసి ఉంటారని అనుమానం
ఈ రోజు ఉదయం 6 గంటలకు స్థానికులు ఓ బ్రిడ్జి కింద ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాసేపట్లో ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు.