Prabhas: లేడీ ఓరియెంటెడ్ మూవీలో పూజా హెగ్డే?

Hanu Raghavapudi Movie
  • స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే హవా 
  • త్వరలో రానున్న మరో రెండు సినిమాలు 
  • హను రాఘవపూడితో చేసే ఛాన్స్  
తెలుగు తెరపై అగ్రకథానాయికగా ఇప్పుడు పూజా హెగ్డే దూసుకుపోతోంది. వరుస అవకాశాలు .. వరుస విజయాలు ఆమె మార్కెట్ ను ఒక రేంజ్ కి తీసుకెళుతున్నాయి. ప్రభాస్ తోను .. అఖిల్ తోను ఆమె చేస్తున్న సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల హను రాఘవపూడి వినిపించిన ఒక కథ పట్ల ఆమె సుముఖతని వ్యక్తం చేసిందని అంటున్నారు. అయితే డేట్స్ చూసుకుని ఆమె అధికారికంగా చెప్పవలసి ఉందట. ఆమె ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. నయనతార .. అనుష్క .. సమంత నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను భుజాలపై వేసుకుంటూ ఉండగా, పూజా కూడా ఆ దిశగా అడుగులేస్తుందేమో చూడాలి.
Prabhas
Akhil
Pooja Hegde

More Telugu News