Corona Virus: దేశంలో 110కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.. మహారాష్ట్రలో 33 మందికి సోకిన వైనం

tested positive for coronavirus
  • ప్రకటించిన ప్రభుత్వం
  • కేరళలో  22 మంది బాధితులు
  • హర్యానాలో 14 మంది 
దేశంలో కరోనా 'కోవిడ్‌-19' కేసుల సంఖ్య 110కి చేరిందని ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. వారిలో 17 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. మహారాష్ట్రలో మరొకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

ఇప్పటివరకు దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారు. దేశంలో అత్యధిక కరోనా బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. అనంతరం కేరళలో అత్యధికంగా 22 మంది ఉన్నారు. హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
Corona Virus
India
Maharashtra

More Telugu News