Kesineni Nani: సీఎం అయినంత మాత్రాన అన్నీ నీవు అనుకున్నట్టు జరగవు: కేశినేని నాని

Though you are a CM everything cant happen as you wish says Kesineni Nani
  • ఎన్నికలను వాయిదా వేయడంపై ఈసీని విమర్శించిన జగన్
  • అన్నీ మీరు అనుకున్నట్టు జరగవని కేశినేని నాని వ్యాఖ్య
  • ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని విమర్శ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సూచనల మేరకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికలను వాయిదా వేశారంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో, జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా' అని కేశినేని నాని అన్నారు. రాష్ట్రాన్ని నియంతలా పాలిద్దామంటే కుదరదని చెప్పారు. మీరు సీఎం అయినంత మాత్రాన... అన్నీ మీరు అనుకున్నట్టుగా జరగవని, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls
EC

More Telugu News