Corona Virus: ఆ రెండుసార్లు నెగెటివ్ వస్తేనే కరోనా వైరస్ నుంచి బయటపడినట్టు!

centre released discharge policy for corono
  • డిశ్చార్జి పాలసీని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  • చికిత్స అందించే వారికి 24 గంటల్లో రెండుసార్లు పరీక్షలు 
  • రెండుసార్లూ వైరస్ లేదని రిపోర్టులో వస్తేనే విడుదల

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం కరోనా. చైనాలో మొదలై యూరప్ లో అలజడి సృష్టిస్తున్న ఈ వైరస్ భారత్ లోనూ ఆందోళనకర రీతిలో విస్తరిస్తోంది. ఇప్పటికే వ్యాధిని జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చికిత్స అందిస్తున్న వారిని విడుదల చేయడానికి తాజాగా 'డిశ్చార్జి పాలసీ'ని ఆయా ఆసుపత్రులకు విడుదల చేసింది. 

ఈ నివేదిక ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకున్నారని పూర్తి నమ్మకం కుదిరాక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. ఆ రెండుసార్లూ నెగిటివ్ రిపోర్టు రావాలి. ఈ శాంపిళ్ల టెస్ట్‌తో పాటు చెస్ట్ రేడియోగ్రఫీ కూడా చేస్తారు. దీని ద్వారా బాధితుడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడా? లేదా? అనేది తెలుసుకుంటారు. అక్కడ కూడా ఓకే అనిపిస్తేనే రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు.

Corona Virus
discharge policy
central government

More Telugu News