Chandrababu: జగన్​ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

Chandrababu hot comments on Jagan
  • ప్రపంచాన్ని ‘కరోనా’ గడ గడ లాడిస్తోంటే ఏం ప్రమాదం లేదంటారా?
  • ఇరాన్ లో కూడా ఓ మంత్రి ఇలాగే మాట్లాడారు!
  • రాష్ట్ర ప్రయోజనాలు జగన్ కు పట్టవు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తోంటే, ఏం ప్రమాదం లేదని చెబుతున్న జగన్ మాదిరిగానే ఇరాన్ లో ఓ మంత్రి కూడా మాట్లాడారంటూ ఆయన ప్రసంగ వీడియోను చూపించారు. ‘ముఖ్యమంత్రికి బుద్ధి, ఆలోచన అనేవి ఉంటే’ ఈ వార్త చదవాలని, సంబంధిత వీడియో చూడాలంటూ తీవ్ర విమర్శలు చేశారు.

‘కరోనా’ వ్యాప్తి గురించి తేలికగా మాట్లాడిన ఇరాన్ మంత్రి, కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వైరస్ బారినపడి, ఆసుపత్రిలో చేరారని, ఈ వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుందని చెబుతూ తన తప్పును ఆయన ఒప్పుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ‘కరోనా’ గురించి తేలికగానే మాట్లాడినా, ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో చర్యలు చేపట్టారని అన్నారు. ‘కరోనా’పై జగన్ ఒక్కరోజు సమీక్ష నిర్వహించలేదని, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదని, రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Corona Virus
Andhra Pradesh

More Telugu News