సీఎం అధికారాలకు కూడా పరిమితులు ఉంటాయని ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది: ఐవైఆర్ కృష్ణారావు
- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
- ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
- ట్విట్టర్ ద్వారా హితవు పలికిన ఐవైఆర్
సహేతుకమైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ఐవైఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ఒక్క విషయం మినహాయిస్తే.... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఆ ప్రక్రియ ముగిసేవరకు మిగతా అన్ని అంశాల్లో అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని వ్యాఖ్యానించారు.